SAKSHITHA NEWS

బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ.

పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్, గ్రైండర్ ను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ డి జి ఎం గిరిధర్ బక్షి మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారని అలాగే మన హాస్టల్ విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పారు. రామ్ కి ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో పాటు రామ్ కీ ఫౌండేషన్ కూడా బీసీ, ఎస్టీ హాస్టల్ కు అవసరమైన మేరకు సహాయం చేస్తుందని చెప్పారు.

గత సంవత్సరం హాస్టల్ నుండి చదువుకొని పదో తరగతి నందు హాస్టల్ వారీగా ప్రధమ, ద్వితీయ, తృతీయ శ్రేణి సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సుజాత మాట్లాడుతూ గతంలో కూడా రామ్ కీ ఫౌండేషన్ వారు ఫ్యాన్లు, ట్యూబులైట్ లు, ఎల్ఈడి బల్బులు అందజేశారని అంతేకాకుండా పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారని ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు రామ్ కీ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ కీ ఫౌండేషన్ ఉద్యోగులు శ్రీనివాస్, రాజేశ్వరి మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS