SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

WhatsApp Image 2023 10 06 at 7.08.42 PM

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ కి,గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ కి నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోని మహిళలు ముఖ్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం  ఉచితం గా చీరల పంపిణి చేయడం జరిగింది అని ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ  యొక్క చీరల పంపిణీకి  నియోజక వర్గం లో  పేద మహిళలకు అందించడం చాలా ఆనందం గా ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు బతుకమ్మ పండుగా ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి  చూపిన ఘనత మన ప్రభుత్వం కే దక్కిందని  అని తెలియచేసారు.అదేవిధంగా దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింది అని బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు.. బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నది . ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS