SAKSHITHA NEWS

Dipti Sri Nagar Nala from Eerla Pond under Hafizpet Division

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు(వయా జాతీయ రహదారి NH 65 వరకు ) రూ.15.88 పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయం తో 2.4 KM ల మేర చేపడుతున్న నాల విస్తరణ పనులలో భాగంగా మంజీర పైప్ లైన్ రోడ్డు వద్ద జరుగుతున్న నాల విస్తరణ పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ Strategic Nala Development Programme (SNDP) వ్యూహాత్మక నాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు(వయా జాతీయ రహదారి NH 65 వరకు ) రూ.15.88 పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయం తో 2.4 KM ల మేర చేపడుతున్న నాల విస్తరణ పనులు చేపట్టడం జరిగినది అని , ముంపు కు శాశ్వత పరిష్కారం దిశగా నాల విస్తరణ పనులు చేపట్టడం జరిగినది అని , ఇక ముంపు సమస్య ఉండదని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని, వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, రామ కృష్ణ నగర్ లో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని,అదేవిధంగా రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు ,నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని,ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అదేవిదంగా అధికారులు సమన్వయం తో కలిసి పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమమహేశ్వరావు, నాగేశ్వరరావు, మోహన్, సురేందర్, ప్రదీప్,పనింద్ర, విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS