Dilapidated houses in the village should be removed: Vikarabad MLA
గ్రామంలోని పాడు పడ్డ ఇండ్లు తొలగించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
సాక్షిత: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 12:30 PM వరకు పర్యటించారు.
కోటమర్పల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని, జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీ లకు న్యూట్రిషన్ కిట్స్, బీపీ, షుగర్ ఉన్నవారికి NCD కిట్స్, 9 సంవత్సరాలనుండి 15 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు మెదడు వాపు రాకుండా జై ఇంజక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని, కంటి చూపు మందగించిన వారికి జనవరి 18 నుండి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామంలోని పాత స్థంబాలు తొలగించి అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని, గ్రామంలో విద్యుత్ తీగలను సరిచేయాలని, గ్రామం మధ్యలో నుండి ఉన్న 11 KV లైన్ ను ఊరి బయటనుండి వేయాలని, గ్రామంలో కొన్ని చోట్ల థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని మరియు విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తూ ప్రజలకు విద్యుత్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు.
గ్రామంలోని బావులపై పై కప్పులు ఏర్పాటు చేయాలని, గ్రామంలో పాడు బడ్డ ఇండ్లును తొలగించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని 10 వ వార్డు ప్రజలకు సరిపడ నీటిని అందించాలని, త్రాగునీటిలో ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ కలపాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు, లీకేజీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేస్తున్న గ్రామ సర్పంచ్ ను అభినందించారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించలేనటువంటి వారికి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జహీరాబాద్ బస్సు డిపో నుండి కోటమర్పల్లి గ్రామంలో గతంలో మాదిరిగా రాత్రి పూట బస్సు వచ్చి ఉదయం వెళ్లే విదంగా బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని జహీరాబాద్ బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడారు.
గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో ఉంచాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భీమా పథకం ద్వారా కోటమర్పల్లి గ్రామంలో ఇప్పటివరకు 12 మంది కి 60 లక్షలు అందించడం జరిగిందన్నారు, రైతులందరు వారి కుటుంబ సభ్యులపై ఎంతో కొంత భూమి పట్టా చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి రోజు గ్రామ పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ…క్రమం తప్పకుండా గ్రామ సభ నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్యను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.