SAKSHITHA NEWS

Difficulty for others in the celebrations held to welcome the New Year

నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిర్వహించే సంబరాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు

-పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిర్వహించుకునే సంబరాలు ఇతరుల్ని ఇబ్బందిపెట్టే విధంగా ఉండకూడదని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకునే విధంగా పోలీసులకు సహకారించాలి సూచించారు.

జిల్లాలో ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసుబందోబస్తు, అన్ని ప్రాంతాలలో పోలీస్ పెట్రోలీంగ్, విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని,
ఎవరైన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.


సంతోషకరమైన వాతావరణంలో జరుపుకునే నూతన సంవత్సర వేడుకలలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారీన పడి మీ కుటుంబాలలో విషాదం నింపే పరిస్ధితి తీసుకొని రాకుండా ప్రతి పౌరుడు భాద్యతగా వేడుకలు జరుపుకొవాలని సూచించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, డాబాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటల్‌లు మూసివేయాలన్నారు.


ప్రధన కూడళ్ళలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహన చోదకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ర్యాలీలు, బాణసంచా పేలుడు నిషిద్ధమని తెలిపారు. హై స్పీడ్ నియంత్రణకు బారీగేట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలని, మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

న్యూ ఇయర్‌ వేడుకలకు మార్గదర్శకాలివే…

తాత్కాలిక వినోద లైసెన్స్ మంజూరు కోసం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తుదారుడు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి
బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు.


ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనం నడిపిన జైలు, జరిమానా.
అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు.
వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు.


ట్రిపుల్ రైడింగ్, వాహనాల సైలెన్సర్ లను తీసివేసి శబ్ద కాలుష్యం చేస్తూ రోడ్లపై అతివేగంగా నడుపుతూ ఇబ్బంది పెడితే కేసులు నమోదు చేయడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.


వేదికలోకి ప్రవేశించే వ్యక్తులను స్కాన్ చేయడానికి ఎంట్రీ పాయింట్ వద్ద ఐ ఆర్ థర్మామీటర్లు ,థర్మల్ స్కానర్‌లను ఏర్పాటు చేయాలి.
భద్రత దృష్ట్యా వేడుకలకు సామర్థ్యానికి మించి పాస్‌లు, టికెట్లు, విక్రయించడం చేయరాదు.
అన్ని ప్రవేశ ,నిష్క్రమణ, పార్కింగ్ ప్రదేశాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను పాటించాలి.


అన్ని వాహనాల పార్కింగ్ ఉండేలా చూడాలి. ప్రధాన రహదారిపై పార్కింగ్ అనుమతించకూడదు.
లైసెన్సుదారుడు తగిన సంఖ్యలో సెక్యూరిటీ గార్డులను నియమించాలి. క్రమబద్ధమైన పార్కింగ్ గురించి సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. నిర్వహించబడుతున్న ప్రోగ్రామ్‌కు కొనసాగింపుగా ఏదైనా నష్టం ,ఉపద్రవం మొదలైన వాటి బాధ్యత పూర్తిగా లైసెన్స్‌దారుని మాత్రమే కలిగి ఉంటుంది.


ప్రజలకు ప్రమాదం లేదా నష్టాన్ని కలిగించే ప్రమాదకరమైన ప్రదర్శన లేదా ప్రదర్శన ఉండకూడదు అని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్
తెలియజేశారు.


SAKSHITHA NEWS