గుంటూరు… టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర పీసీ…
గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
ధూళిపాళ్ల కామెంట్స్…
ఎన్నికల ముందు ప్రజలను ముద్దులతో ముంచెత్తిన ముఖ్యమంత్రి ఎన్నికల తరువాత అబద్ధాలు ఐ కాన్ గా కనబడుతున్నాడు….
2024 తర్వాత జగన్ పదవిని కోల్పోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే క్రూర నాటకంలో భాగమే పేదల ఇళ్ల స్థలలాల నాటకం….
నాడు అమరావతిని ఎడారి అన్నవాడు ఎక్కడెక్కడి వారిని తీసుకువచ్చి (23వేల మంది గుంటూరు జిల్లా వాసులు,27వేల మంది కృష్ణా జిల్లా వాసులు) ఆ ఎడారిలోనే పేదలకు ఇళ్ళు అంటూ మోసం చేస్తున్నాడు….
రాజకీయ దురుదేశ్యం తోనే 50వేల మంది పేదలను బలి పశువులను చేసి రాజకీయ క్రీడతో అమరావతి రాజధాని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది YCP….
ప్రజా ధనం దుర్వినియోగం చేయడానికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా లెక్కచేయకుండా భూములు పందేరాం మొదలుపెట్టారు….
అధికారంలోకి వచ్చిన రాగానే ఊసరవెల్లి మాదిరిగా రంగులు మారుస్తూ రంగుల ప్రపంచం చూపిస్తూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు….
పేదలకు తమకు అనువుగా ఉన్న స్థలాలలో ఇళ్లను నిర్మించి ఇవ్వమని లబోదిబోమంటున్నారు, ముఖ్యమంత్రి మాత్రం అనేక రకాల వేషాలు వేసి వాళ్ళను మోసం చేస్తారా అని ప్రశ్నించారు…
ముఖ్యమంత్రి తన సభలో మూడు ఆప్షన్స్ ఇచ్చారు….
డబ్బులు ఇస్తాం అని, అకౌంట్స్ లో వేస్తామని, ప్రభుత్వ మే కట్టి ఇస్తుందని చెప్పడం చూస్తే విడ్డురంగా ఉంది…
గతంలో కూడా ఇలానే చెప్పి లక్షలాది మంది ఇల్లులేని పేదలను మోసం చేసిన సంగతి మరచిపోయారా ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు…
సుప్రీంకోర్టు Bench రైతులు వేసిన కేసులో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలమీద వారికి ఎలాంటి హక్కులేదని చెప్పిన సంగతి తెలియదా….
పేదలఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ రాజకీయప్రయోజనాలు కోసమే ఎన్నికలలో లబ్ది పొందాలనే దురుదేశ్యంతో పొలాలు ఇచ్చిన రైతులను వేధిస్తూ ఈ కార్యక్రమం….
పది తలల రాక్షసుడు పురాణంలో రావణాసురుడు ఐతే నేటి యుగంలో పదితలల రాక్షసుడు జగన్…
అమరావతి రాజధానిలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయి…
ఎన్నికల ముందు అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నేడు చోద్యం చూస్తున్నారు….
రాష్ట్రానికి మంత్రులు లేరా? క్యాంప్ క్లర్క్ ఆయినా సజ్జల రామకృష్ణ రెడ్డి వెళ్లి పర్యవేక్షణ చేయలేదా?
వైసీపీ లో దళిత మంత్రులు, నాయకులు లేరా వారికి మనోభావాలు లేవా అంటూ ప్రశ్నించారు….
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు..