ధారూర్ మండల పరిధిలో నుండి వికారాబాద్ మండల పరిధిలోకి మార్చాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ హోంశాఖ మాత్యులు “మహమూద్ ఆలీ” ని మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , రాళ్లచిట్టెంపల్లి, సర్పన్ పల్లి, గోధుమగూడ మరియు జైదుపల్లి గ్రామాల రెవిన్యూ విభాగాన్ని ధారూర్ మండలం నుండి వికారాబాద్ మండలంలో కలపడం జరిగిందని, రెవెన్యూ మాదిరిగానే ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుండి వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ గ్రామాలను మార్చాలని, మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్యే గారి వినతికి హోంమంత్రి సానుకూలంగా స్పందించారు.