Dharna of students in front of the school gate
పాఠశాల గేటు ముందు విద్యార్థుల ధర్నా..
ప్లక్కార్డులు చేతబట్టి ఆందోళన చేపట్టిన విద్యార్థులు ..
పాఠశాల నుండి డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్…
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ముట్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల గేటు ముందు సుమారు 180 మంది పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు తమకు ఉపాధ్యాయులు సరిపడలేక పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్లకార్డులు చేత పట్టుకొని ఆందోళన చేపట్టారు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు
కొందరు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది దీంతో తము చదువు నష్టపోతున్నామని ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు రంగారెడ్డి జిల్లాలో కొందూర్గు, చౌదరి గూడా ,ఫరూక్ నగర్ కేశంపేట నందిగామ, కొత్తూరు, మండలాల్లో ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై వెళ్లడంతో పాటు విధులు ఓ చోట నిర్వహిస్తు జీతాలు మరో చోట తీసుకుంటున్నారని గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ చదును నష్టపోతున్నారనీ అటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు…