SAKSHITHA NEWS

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా

ములుగు జిల్లా:
మావోయిస్టుల దుశ్చర్య ను నిరసిస్తూ ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో నిన్న రాత్రి ఇద్దరిని మావోయిస్టులు దారుణం గా నరికి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే.

ఈ దుశ్చర్యను నిరసిస్తూ ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు.

శుక్రవారం వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చినఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తూ….

ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ నినదించారు. మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అని నినాదాలు చేశారు.


SAKSHITHA NEWS