SAKSHITHA NEWS

90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలు
వేములవాడ:

వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.

ధర్మగుండంలో స్నానం ఆచరించి ప్రత్యేక క్యూలెన్ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర దగ్గర పడడంతో భక్తుల రద్దీ పెరిగింది. గుడి చెరువు మైదానం భక్తుల వెహికల్స్తో నిండిపోయింది.

Whatsapp Image 2024 01 30 At 4.18.11 Pm

SAKSHITHA NEWS