SAKSHITHA NEWS

దేవినేని ఉమామహేశ్వర రావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి

కామెంట్స్:

24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ తప్పు చేయకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నిందారోపణతో చంద్రబాబు గారిని నిర్భందించి కక్షపూరిత కుట్రపూరిత వైఖరితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసు బనాయించింది

చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసి రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు

ఫైబర్ గ్రిడ్ పేరుతో నెలకు 35 కోట్లు వసూలు చేసుకుంటూ జగన్ రెడ్డి బొమ్మ చూపిస్తున్న ప్రభుత్వం అవినీతి అని ఎలా చెప్తుంది

రోడ్డే వేయలేదు కానీ రింగు రోడ్డులో అవినీతి అంటూ తప్పుడు కేసులు బనాయించారు

ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జైల్లో చంద్రబాబు గారు రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రహ్మణి గార్లు సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు

నారా లోకేష్ గారు న్యూఢిల్లీలో, అచ్చం నాయుడు గారు జాతీయ పార్టీ కార్యాలయంలో, 14 కోట్ల మంది తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్టీలు కులాలు, మతాలకు అతీతంగా సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు

పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి నారా భువనేశ్వరి గారికి బ్రాహ్మణి గారికి సంఘీభావం తెలుపుతున్నారు

45 ఏళ్లు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి రాష్ట్రపతి నియామకల్లో ఆయన పాత్ర కీలకమైనది

ఐటీ రంగంలో ఆయన చూపిన చొరవ, ప్రతిభ దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈరోజు వాళ్ళు చూపిస్తున్న ఉద్యమ స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది

హైటెక్ సిటీ నిర్మాణం, సైబరాబాద్ నిర్మాణం, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బయోటెక్నాలజీ పార్కులు, టెక్నాలజీ హబ్బులు, పోలవరం 72% పనులు, ఆయన తెచ్చిన కియా కారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మైలురాళ్లు

బురదజల్లే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు

పుంగనూరు అంగళ్లు లో మా బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో కేసు వేశారు

పార్టీలకు అతీతంగా ఈరోజు చేస్తున్న నిరాహార దీక్ష ఈ సైకో ప్రభుత్వాన్ని కదిలిస్తుంది.

WhatsApp Image 2023 10 02 at 6.15.26 PM

SAKSHITHA NEWS