125- గాజుల రామారం డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డి నగర్ ఫేస్ – 1, పేస్ -2, పోచమ్మ బస్తి, కట్ట మైసమ్మ బస్తి, బతుకమ్మ బండ, నరసింహ బస్తీ, యండమూరి ఎన్క్లేవ్, గాజులరామారం విలేజ్, జీ.వి.భవాని నగర్ లలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ నాడు అరకొర నిధులతో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సంపూర్ణ నిధులతో శరవేగంగా అభివృద్ధి చెంది నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ఎంతోమంది ఉన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తో డివిజన్లోని అనేక కాలనీలు అభివృద్ధి చెందాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇలా వేగంగా జరుగుతున్న అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన వారు నాగేష్, అరుణ్ వారి మిత్ర బృందం కిరణ్, వంశీ, రమేష్, నరసింహ, రుతిక్, వెంకటేష్, పునీత్ ల తోపాటు 50 మంది చేరారు.
మధు మరియు వారి మిత్రబృందం 50 మంది చేరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, మల్లేష్, సంధ్యారెడ్డి లక్ష్మి, ఆవిద్, మంజుల, చెట్ల వెంకటేష్, రాజేందర్, నారాయణ, ప్రసాద్, తెలంగాణ సాయి, పర్ష శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.