అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూసి బొక్క బోర్లా పడి అదే వ్యవస్థను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిన ఒక అధికారి!!
కట్టెలు అమ్మిన చోటే కట్టెలు కొట్టుకునే పరిస్థితి!!
పేదలకు గుప్పెడు అన్నం అందించే అన్న క్యాంటీన్లను , అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించడంలో కీలక పాత్ర పోషించిన మంగళగిరి మాజీ కమిషనర్ హేమామాలిని రెడ్డి , తిరిగి అదే అన్న క్యాంటీన్ల పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు..
దీనిని బట్టి అర్థమవుతుంది విధి ఎంత విచిత్రమైనది అని!!
అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అని ఇటువంటి ఘటనలతో వెల్లడవుతుంది …
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కక్ష సాధింపు చర్యలకు ఎగబడలేదు, ఎవరి మీద కూడా దాడులకు తెగబడలేదు , అంతా కూడా ప్రజా తీర్పుకు వదిలేశారు..
ఏ అధికారి అయితే ఒక వ్యవస్థను నాశనం చేసి పేదల నోటి దగ్గర కూడు లాగివేయాలని ప్రయత్నించారో , అదే అధికారి దగ్గర ఉండి మరి అన్న క్యాంటీన్లలో పేదలకు ఆహారం అందించే బాధ్యత నిర్వహిస్తూ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కలిగింది..
విధి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు !!
సాధారణంగా అన్న క్యాంటీన్లలో భోజనం మధ్యాహ్నం 12 గంటల 30 ని