సాక్షితసికింద్రాబాద్ : అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ పరిధిలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ జేసే 49 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ బోయబస్తీ కమ్మునిటి హాల్ లో జరిగిన కార్యక్రమంలో అందించారు. కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ యువ నేతలు రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్, అధికారులు, నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అడ్డగుట్ట ను సికింద్రాబాద్ లోనే కాకుండా నగరంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పెద్ద మురికివాడగా నిలిచిన అడ్డగుట్ట రూపాన్ని మార్చమని తెలిపారు. తుకారం గేట్ ఆర్ యు బీ ద్వారా చిరకాల స్వప్నాన్ని నేరవేర్చమని తెలిపారు. పేదలకు పెళ్ళిళ్ళు చేయడం కష్టతరంగా మారిన దశలో ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వ పధకాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని పద్మారావు గౌడ్ తెలిపారు. అధికారులు నేతలు పాల్గొన్నారు.