SAKSHITHA NEWS

ఎల్‌.ఓ.సి పత్రం అందజేసిన ఉపసభాపతి పద్మారావుగౌడ్


సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ తార్నాక డివిజన్ కు చెందిన లోకేష్ మరియు వెంకటమ్మ మరియు అస్మా మెయిన్ కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్నన నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉపసభాపతి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు.
మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా నిమ్స్ ఆసుపత్రి నుండి లోకేష్ కు 1 లక్ష రూపాయలు, వెంకటమ్మ కు 2 లక్షల 50 వేలు రూపాయలు మరియు అస్మా మెయిన్ కు 2 లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీ మంజూరు అయ్యింది. ఈ మేరకు గురువారం చేతులమీదుగా కుటుంబసభ్యులకు ఎల్ ఓ సి పత్రాలనుఅందజేశారు.ఈ కార్యకమం లో బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్,కట్టేల శ్రీనివాస్ యాదవ్, సెట్విన్ మేనేజంగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి,సుంకు రాంచందర్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సితాఫలమండీ లో ప్రభుత్వ హై స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీలకు కొత్త భవన పనులు త్వరలో ప్రారంభం

సికింద్రాబాద్ మార్చ్ 16 సాక్షిత సితాఫలమండీ లో ప్రభుత్వహైస్కూల్,జూనియర్, డిగ్రీ కాలేజీలకు కొత్త భవన సముదాయాలు నిర్మించే పనులను త్వరలో ప్రారంభిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.29.75 కోట్ల మేరకు నిధులను ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి టి.పద్మారావు గౌడ్ సాధించిన నేపద్యంలో కొత్త భవనాల నిర్మాణానికి వీలుగా పాత భవనాల కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు.ఈ పనులనుపద్మారావు గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త భవనాల నిర్మాణం పనులను వీలైనంట్ త్వరగా ప్రారంభించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని,కొత్త భవనాలను మోడల్ గా తీర్చిదిద్దాలని అయన సూచించారు.


SAKSHITHA NEWS