SAKSHITHA NEWS

ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ పాదయాత్ర….

సాక్షిత: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ సాయి నగర్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & సీనియర్ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, ఓపెన్ నాలా పనులను, అలాగే దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని చేయాలనీ డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు ఏఈ ప్రవీణ్, నాయకులు సంభాశివా రెడ్డి, జలగం చంద్రయ్య,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS