SAKSHITHA NEWS

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు.

దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖ ర్‌రెడ్డి, మర్రి లక్ష్మణ్‌రెడ్డికి సంబంధించిన ఎంఎల్‌ ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ కళాశాలల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్‌ అధికారులు తొలగించారు.

కొద్ది రోజుల కిందటే కలెక్టర్‌ కలెక్టర్‌ నేతృత్వంలో అధికారులతో కలిసి పర్యటించి 405, 482, 484, 488, 592 సర్వే నెంబర్‌లలో పూర్తిగా 8 ఎకరాలలో కబ్జా చేసి కాలేజీ నిర్మాణాలు జరిగినట్టు గుర్తించారు.

దాంతో గురువారం ఉద యం జేసీబీతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే అధికారులు కూల్చి వేస్తుండగా విద్యార్థులు అడ్డుగా రాగా.. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు.

ఒకానొక సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెల కొంది. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యేలు కె.పి వివేకానంద, మాధవరం కృష్ణారావు, శంబీపూర్‌ రాజు, బండారి లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనను విస్మరించి ప్రతిపక్షాల ఆస్తులను కూల్చివేయడం పనిగా పెట్టుకోవడం అమాను షమన్నారు. ఇది ముమ్మా టికీ కక్ష సాధింపేనని.. కూల్చివేతలను ఖండి స్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ ప్రజలు గమనించాలని, హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చడానికే ఈ కూల్చివే తలు జరుపుతున్నార న్నారు.

WhatsApp Image 2024 03 08 at 3.14.50 PM

SAKSHITHA NEWS