న్యూ ఢిల్లీ:
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూర దర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్ చానల్ ఇప్పు డు దాని లోగో రంగును మార్చారు. అది కూడా కాషాయ రంగుకి మార్చారు.
లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం పట్ల అధికార బీజేపీపై పెద్దయె త్తున విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శిం చిందని, అందుకే కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను చాటుకుందని విమర్శలు వస్తున్నాయి.
ఈ మార్పుపై ‘ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని గతంలో దూరదర్శన్ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించారు.
దూరదర్శన్ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు…