
కూకట్పల్లి డివిజన్ లోని దయార్ గూడ స్మశాన వాటికను ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్ స్మశాన వాటికగా తీర్చిదిద్దాలని సూచించారు.. అలాగే ప్రకాష్ నగర్ స్మశాన వాటికలో బాత్రూం సదుపాయం కల్పించి రోడ్లు.. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.. ముఖ్యంగా దోమల సమస్య అధికంగా ఉన్న ఎడల అధికారులు ఎక్కడకక్కడ దోమల మందు పిచికారీ చేయాలని శానిటేషన్ విషయంలో అలసత్వం వహించద్దని సూచించారు.. ఈ కార్యక్రమంలో .ఈఈ గోవర్ధన్ ..డీఈ నిఖిల్ రెడ్డి, ఏఈ సునీల్, ప్రసన్న తదితరుల అధికారులు..నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app