సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన దయాకర్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత;
బోనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చెక్కులను అందించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన ఎం. చిట్టిబాబుకు, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన మల్లయ్యకు, రామాపురం గ్రామానికి చెందిన జి. లక్ష్మికి, చిన్నబీరవల్లి గ్రామానికి చెందిన విమలమ్మకు ఈ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మినేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, సురేష్, రాంబాబు, మురళీ, కృష్ణ, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, యోహాను, సతీష్ తదితరులు ఉన్నారు.