గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు
తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు.
ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.