డాక్టర్ జయప్రకాష్ సాయిని అభినందించిన దారపనేని……..
కనిగిరి సాక్షిత న్యూస్ ,,,,,,
ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అడ్వైజర్ డాక్టర్ జయప్రకాష్ సాయిని కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శనివారము పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. డాక్టర్ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ అడ్వైజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుండి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి సారించి దేశంలోనే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ను ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ జయప్రకాశ్ సాయి కే దక్కుతుందని దారపనేని కొని యాడారు.
అంతేకాకుండా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు దేశంలోనే తగిన గుర్తింపు లభించిందని వారు ప్రశంసించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అడ్వైజర్ గా సంవత్సరకాలం పూర్తి చేసి రెండవ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న డాక్టర్ జయప్రకాష్ సాయికి దారపనేని శుభాకాంక్షలు తెలిపారు.