Dalits thanked Chief Minister KCR for naming Telangana Secretariat after Ambedkar
కరీంనగర్ జిల్లా విణ వంక మండలంలోని తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు *పెడుతున్నందుకు దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు
వేనవంక మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు బిఆర్. అంబేద్కర్ పేరును నామకరణం చేయడం పట్ల వర్షం చేస్తూ వీనావంక టిఆర్ఎస్ దళిత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నవిఅన్నారు. డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నదని కొనియాడారు
భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేసారు
ఈ కార్యక్రమంలో తాండ్ర శంకర్, పార్లపల్లి తిరుపతి, పులి ప్రకాశ్, దాసరపు శ్యామ్, సుధాకర్, కొల్లూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.