SAKSHITHA NEWS

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జి
దైద రవీందర్ సందర్శించారు.
ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలు అయిన ధాన్యం బస్తాలు లారీల కొరతతో సెంటర్లలో నిల్వ ఉండి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అలాగే తూకాలు కూడా బస్తాకు 41 కిలోలు పెడితే 39 కిలోలకే తక్ పట్టి ఇస్తున్నారని ఒక కింటాకు దాదాపు రైతు 5 కేజీలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. లోడింగ్ అయిన ధాన్యం లారీలు మిల్లుల దగ్గర దిగుమతి ఆలస్యం అవుతున్న నేపధ్యంలో లారీల కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి ధాన్యం లారీలు తొందరగా దిగుమతి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంగలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సందినేని వెంకటేశ్వరరావు, సుమన్ రావు, యం.డి యూసుఫ్, అబ్దుల్ మజీద్, వంటెపాక నక్షత్, పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS