విశ్వసనీయ సమాచారం మేరకు SOT రాజేంద్రనగర్ బృందం ఒక కంటైనర్ వాహనం RJ 11 GB 7568, పాట్నా, బీహార్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి RGIA పీఎస్ పరిధిలోని శ్రీధర్ ఐషర్ పార్కింగ్ ఏరియా వద్ద పార్క్ చేసివుండగ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ లో వాహనం లోపల పెద్ద సంఖ్యలో ఉన్న సీల్డ్ కాటన్లు తెరచి చూడగా మొత్తం 395 కాటన్ల నిషేధించబడిన PARIS మరియు గోల్డ్ విమల్ సిగరెట్లు మరియు గోల్డ్ స్టెప్ డిటర్జెంట్ పౌడర్ 120 బ్యాగులు (ఒక్కొక్క బ్యాగ్ 25 కేజీలు) ఉన్నాయి. వీటి విలువ దాదాపుగా రూ 2,15,32,500/-. ఉన్నాయి.
వాహనం దగ్గర ఉన్న నలుగురు నిందితులను పట్టుకుని విచారించగా
4 రోజుల క్రితం పాట్నా ఔటర్ ఏరియా నుండి కంటైనర్ ప్రారంభమైంది.
400 క్వింటాళ్ల గోల్డ్ స్టెప్ డిటర్జెంట్ పౌడర్ పేరుతో మెటీరియల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
పంపిన వారు గుడ్ లక్ కమర్షియల్ కంపెనీ, గయా, బీహార్,
హైదరాబాద్ లోని రిసీవర్ శ్రీరామ ఎంటర్ ప్రైజెస్, జమిస్తాన్‌పూర్, ముషీరాబాద్
400 క్వింటాళ్ల గోల్డ్ స్టెప్ డిటర్జెంట్ పౌడర్ పేరు మీద పన్ను ఇన్‌వాయిస్ పై రవాణా చేస్తున్నారు
పన్ను ఇన్‌వాయిస్ పై రిసీవర్ GST నంబర్ పేర్కొనబడలేదు (ఇది చట్టవిరుద్ధం.)
కంటైనర్ లో కేవలం 31 క్వింటాళ్ల గోల్డ్ స్టెప్ డిటర్జెంట్ పౌడర్ 125 ప్లాస్టిక్ బ్యాగ్‌లలో ప్యాక్ చేయబడింది, ఒక్కో బ్యాగ్‌లో 25 కేజీలు.
డిటర్జెంట్ పౌడర్ బ్యాగ్‌లతో సిగరెట్ కాటన్‌లను కనబడకుండా దాచి రవాణా చేస్తున్నారు.
కంటెయినర్‌లో ఉన్న మెటీరియల్ గురించి ఎవరైనా అడిగితే, తాము డిటర్జెంట్ పౌడర్‌ను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నామని చెప్పాలని డ్రైవర్ & క్లీనర్‌కు వివరించారు.
పంపినవారు కంటైనర్‌కు అమర్చిన GPS ద్వారా ఎప్పటికప్పుడు కంటైనర్ కదలికను పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత పంపినవారికి తెలియ చేయగా రిసివర్ తరపున సయ్యద్ ఇలియాసుద్దీన్‌ను పార్కింగ్ ప్రాంతానికి పంపాడు.
సయ్యద్ ఇలియాసుద్దీన్‌ను విచారించగా రెహాన్ ఖాన్ అనే వ్యక్తి పంపించాడు అని తెలిపాడు.
సయ్యద్ ఇలియాసుద్దీన్ రెహాన్ ఖాన్ కు సహాయకుడి గా కొద్ది కాలంగా పని చేస్తున్నాడు.
రెహాన్ ఖాన్ అనే వ్యక్తి తెలంగాణా మొత్తానికి ఈ అక్రమంగా రావాణా చేయబడ్డ నిషేధిత సిగరెట్స్ రవాణా చేస్తున్నట్లు తెలిపాడు.
వివరాలు
1). రెహన్ ఖాన్ R/o కిషన్ బాగ్, హైదరాబాద్ (మెటీరియల్ రిసీవర్ – పరారీ
2). సుభాష్ @ రాజు R/o GAYA, బీహార్ (మెటీరియల్ సరఫరాదారు – పరారీ)
3). సయ్యద్ ఇలియాసుద్దీన్ S/o సయ్యద్ నజీరుద్దీన్, వయస్సు 36, Occ ఆటో డ్రైవర్ (రెహాన్ ఖాన్ కు సహాయకుడు), R/o శాలిబండ, హైదరాబాద్.
4). రవికాంత్ కుమార్ S/o రామేశ్వర్, వయస్సు 37 సంవత్సరాలు, OCC: అగ్రికల్చర్ N/o ముజఫర్‌పూర్, బీహార్ (పైలటింగ్)
5). Mohd Shahjad S/o ఖుర్షెద్, వయస్సు 36, Occ. కంటెయినర్ డ్రైవర్ R/o Advar (V) Sadar (M) Nuhu (Dist) హర్యానా
6), ముబారిక్ ఖాన్ S/o ఫకృద్దీన్, వయస్సు 18, Occ లారీ క్లీనర్ R/o R/o అద్వర్ (V) సదర్ (M) నుహు (జిల్లా) హర్యానా.
స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు
1) పారిస్ బ్రాండ్ స్పెషల్ ఫిల్టర్ సిగరెట్లు – 267 కాటన్లు
2) గోల్డ్ విమల్ బ్రాండ్ సిగరెట్లు – 128 కాటన్లు
3) అశోక్ లేలాండ్ కంటైనర్ వెహికల్ (10 టైర్) నం. RJ 11 GB 7568
4) బజాజ్ FZ వాహనం నెం. TS 11 EV 5853
5) స్మార్ట్ ఫోన్లు – 05
6) గోల్డ్ స్టెప్ డిటర్జెంట్ పౌడర్ – 120 బ్యాగులు
స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ రూ. 2.5 కోట్లు
RGIA పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.