SAKSHITHA NEWS

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఓపెన్ హౌస్ విజిట్

-విజిట్ లో పాల్గొన్న విద్యార్థినిలకు అవగాహన కల్పించిన W&CSW డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్.,

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా .,  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థినిలకు ఓపెన్ హౌస్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., మాట్లాడుతూ … ఓపెన్ హౌస్ విజిట్ లో భాగంగా వివిధ కళాశాలకు చెందిన  110 మంది విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

కళాశాలల విద్యార్థినిలకు విమెన్ పోలీస్ స్టేషన్, షి టీమ్ పోలీస్ స్టేషన్ మరియు భరోసా కేంద్రాలను చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు.

ముఖ్యంగా విమెన్ సేఫ్టీ, విమెన్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ మరియు చైల్డ్ సేఫ్టీ ల పై అవగాహన కల్పించామన్నారు.

ఆడియో & వీడియో విజువల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అవగహనా కల్పించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ  శ్రీమతి  నితికా పంత్, ఐపీఎస్., విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశం, ఇన్ స్పెక్టర్ వేణుమాధవ్, విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సునిత మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 07 at 9.07.42 PM

SAKSHITHA NEWS