SAKSHITHA NEWS

రజనీ కొత్త పంచాయతీ:

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన సైబరాబాద్ మొక్క విడదల రజిని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు విడుదల రజని అవినీతి లీలలు చాలా బయటపడ్డాయిగానీ, ఇప్పుడు ‘అవినీతి’ అని అనలేముగానీ, ‘అన్యాయం, అక్రమం’ అనడానికి అర్హత వున్న ఒక కొత్త పంచాయితీ బయటపడింది.
పల్నాడు జిల్లా యడ్లపాడులో కోటయ్య అనే రైతుకి చెందిన మూడెకరాల భూమిని విడదల రజిని తన మరిది గోపీనాథ్ పేరు మీద కొనుగోలు చేశారు. ఎంచక్కా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు.

ఇంకా పాతిక లక్షల రూపాయలు తర్వాత ఇస్తాం అన్నారు. విడదల రజిని గారి తాలూకు కదా అని సదరు రైతు అప్పట్లో ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు రైతు కోటయ్య తన డబ్బు పాతిక లక్షలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా విడదల రజిని అండ్ కో రేపు మాపు అని తిప్పుతున్నారు. దాంతో కోటయ్య డైరెక్ట్.గా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వచ్చేశాడు. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాడు. మరి ఈ ఫిర్యాదు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఒక్క విడదల రజిని విషయం మాత్రమే కాదు.. వైసీపీ ఐదేళ్ళ రాక్షస పాలనలో నష్టపోయినవారు. వైసీపీ నాయకుల చేతిలో మోసపోయిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు చేరుకుని ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ కేసులు తొలగించాలని కొందరు, గత ప్రభుత్వం వల్ల నష్టపోయామని మరికొందరు.. ఇలా వైసీపీ ప్రభుత్వ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు.


SAKSHITHA NEWS