-డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 150 కేజీల గంజాయి
సాక్షిత : డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 150 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని.. సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ నాయక్, ఐపీఎస్., మేడ్చల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బీఎన్ఎస్ రెడ్డి సమక్షంలో అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జోన్ లోని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నర్సింహా రెడ్డి ఆదేశాల మేరకు రాత్రి సమయంలో ట్రాఫిక్ ఎస్ఐ భూపాల్, ఏఎస్ఐ సచ్చిదానందమ్, కానిస్టేబుల్ శివానందం, కానిస్టేబుల్ ఫహీముద్దీన్ మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద డ్రంక్ & డ్రైవ్ విధులు నిర్వహిస్తున్నారు.
కాగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద అటుగా వచ్చిన ఒక స్కార్పియో వెహికల్ లోని డ్రైవరు మరియు ఇంకొక వ్యక్తి పోలీస్ సిబ్బంది చూసి భయపడి చెక్ పోస్ట్ వద్దే వెహికల్ ను వదిలి పారిపోయారు.
దీనితో అనుమానం వచ్చిన పోలీసులు వెహికల్ ను చెక్ చేయగా అందులో 150 కేజీల గంజాయి ఉన్నట్టుగా గుర్తించారు.
గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెహికల్ ను సీజ్ చేయడం జరిగింది. నిందితులు వద్ద నుండి ఒక సెల్ ఫోన్ పడిపోగా సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు. పై అధికారులకు ఆదేశాల మేరకు మేడ్చల్ లా & ఆర్డర్ పోలీసులకు సీజ్ చేసిన వెహికల్ మరియు మొబైల్ ఫోన్ ను అప్పగించడం జరిగిందని తెలిపారు.
గంజాయి రవాణాను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించి వారికి తగు రివార్డులు అందజేయడం జరిగింది.