SAKSHITHA NEWS

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం

Cyberabad CP meeting with movie theater owners in Cyberabad

ప్రజల భద్రతే ముఖ్యం: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

లైసెన్సులు, భద్రత ప్రమాణాలు తప్పక కలిగి ఉండాలి: సినిమా హాళ్ల యజమానులకు సైబరాబాద్ సీపీ ఆదేశం

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని పరిధిలోని రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లాల్లోని సినిమా థియేటర్ యజమానులతో మరియు ఆర్&బి డిపార్ట్మెంట్ , ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జి‌హెచ్‌ఎం‌సి,  లా& ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితర స్టేక్ హోల్డర్స్ తో ఈరోజు i.e. 22.10.2022  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ శ్రీ టీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ శిల్పవల్లి, డీసీపీ బాలానగర్ శ్రీ సందీప్,  డీసీపీ శంషాబాద్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర ఆధ్వర్యంలో  సినిమా హాళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీ గారు మాట్లాడుతూ.. సినిమా థియేటర్ యజమానులు తప్పనిసరిగా వారి థియేటర్ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలన్నారు.

అలాగే సరైన  భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు.

సినిమా థియేటర్లో భద్రత ప్రమాణాలు లేనందు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల భద్రతే ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా నిబంధనల లైసెన్సులను వెంటనే రెన్యువల్ చేసుకోవాలన్నారు. సంబంధిత ఆర్&బి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జి‌హెచ్‌ఎం‌సి డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్ల నుండి లైసెన్సులు తీసుకుని ప్రొసీజర్స్ ను వివరించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుండా థియేటర్లు నడిపే యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. థియేటర్ యాజమాన్యాలు లైసెన్సులను రెన్యువల్ చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే రద్దీగా ఉండే రోడ్లపై రద్దీని తగ్గించేందుకు టైమ్-షెడ్యూల్ పాటించాలని, దీంతో ఆయా ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్‌లు కలగకుండా జాగ్రతలు చేపట్టాలని సినిమా థియేటర్ల యజమానులకు సూచించారు.

వాహనాల జనాభాకు ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.

మరియు సినిమా హాళ్ల సక్రమ నిర్వహణ కోసం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ శ్రీ టీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ శ్రీమతి శిల్పవల్లి, డీసీపీ బాలానగర్ శ్రీ సందీప్,  డీసీపీ శంషాబాద్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర,ఏ‌సి‌పిలు, డి‌ఎఫ్‌ఓ లు సుధాకర్ రావు, శ్రీధర్ రెడ్డి, పూర్ణచందర్ మరియు ఆర్&బి, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, జి‌హెచ్‌ఎం‌సి డిపార్ట్మెంట్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS