SAKSHITHA NEWS

కమలాపూర్ యూనియన్ బ్యాంక్ ను మరోచోట మార్చాలని ఖాతాదారుల డిమాండ్

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని బ్యాంక్ యజమాన్యం

సాక్షిత కమలాపూర్ :
కమలాపూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమలాపూర్ బ్రాంచ్ గత నలబై సంవత్సరాలుగా ఒకే బిల్డింగులో ఉంటు తన బ్యాంక్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. కమలాపూర్ మండలం చుట్టూ ఉన్న పది గ్రామాల ప్రజలు తమ బ్యాంక్ లావాదేవీలను ఉపయోగించుకోవడానికి ప్రతినిత్యం బ్యాంక్ వస్తూ ఉంటారని, ఇన్నేళ్లయిన ఖాతాదారులకు సరియైన సదుపాయాలు కల్పించడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు విఫలమయ్యారని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాష్ కౌంటర్ , అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్ ,చెక్ పాస్ కౌంటర్, దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ప్రజలు క్యూ పద్ధతిని పాటించిన కూడా ఒకరికొకరు తాకుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,

బ్యాంకులో కనీసం త్రాగునీరు సౌకర్యం కల్పించకపోవడం మరియు ప్రజల సౌకర్యార్థం మూత్రశాలలు బ్యాంక్ యజమాన్యం ఏర్పాటు చేయకపోవడం , సరియైన పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు , కమలాపూర్ నుండి హనుమకొండ వైపుగా వెళ్లే రోడ్డుపై బ్యాంకు బిల్డింగ్ ఉండడం వల్ల పార్కింగ్ ప్లేస్ లేక బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు రోడ్డుపై వాహనాలు నిలపడం వల్ల వాహనదారులకు మరియు బాటసారులకు బ్యాంకు వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం మీడియా ద్వారా బ్యాంకు ఉన్నత అధికారులకు తెలిసేలా చేయాలని ప్రజలు కోరారు.తక్షణమే బ్యాంక్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని లేనిచో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంటనే యూనియన్ బ్యాంక్ కార్యకలాపాలు పాత బిల్డింగ్ నుండి మరోచోటకు తరలించి ఖాతాదారులకు సరియైన సదుపాయాలతో కూడిన కొత్త బిల్డింగును సమకూర్చాలని ఖాతాదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


SAKSHITHA NEWS