రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది
ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు
నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు
ఇప్పటికే ప్రారంభమైన పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతుందని అన్నారు
ప్రైవేట్ వ్యాపారులు కాంటాలు తెరిచి, మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సరఫరా, మన ఊరు – మనబడి పనులపై కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
రెండు నెలల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదౌతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వడదెబ్బ, డిహైడ్రేషన్ పై ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్లకు తెలిపారు
ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐ.వీ ఫ్లూయిడ్లు, మందులను పంపించామని వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు
ఆశా కార్యకర్తలు ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలన్నారు