SAKSHITHA NEWS

ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ కేసులు

కుత్బుల్లాపూర్:
ర్యాగింగ్‌తో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని బాలానగర్ ఏసీపీ హనుమంత్ రావు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ హనుమంత్ రావు మాట్లాడుతూ, “ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం. ర్యాగింగ్‌లో పాల్గొనే విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
అదేవిధంగా, ర్యాగింగ్ తాలూకు నైతిక మరియు చట్టపరమైన ప్రభావాలపై విద్యార్థులకు వివరించి, మంచి విలువలను అలవరుచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని, ర్యాగింగ్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ DI కనకయ్య ,SI నాయుడు,SI హరీష్,si సత్యనారాయణ,డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, డైరెక్టర్ గోవిందా రెడ్డి,డైరెక్టర్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ రామకృష్ణ, డైరెక్టర్ రమేష్ బాబు మరియు కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 11 22 at 15.44.33

SAKSHITHA NEWS