సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
తుదిశ్వాస వరకు పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి చేసిన దూసరి స్వామిగౌడ్ ధన్యజీవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలి పారు. స్వామిగౌడ్ 21వ వర్థంతి సందర్భంగా చింతకాని మండల పరిధిలోని నేరడ గ్రామంలో ఆయన స్మారక స్తూపం వద్ద మంగళ వారం సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
నివాళుల ర్పించిన అనంతరం హేమంతరావు మాట్లాడుతూ చింతకాని మండలం నేరడ గ్రామ సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం స్వామిగౌడ్ కృషి చేశారన్నారు. తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడన పని చేసిన ఆయన పలు ప్రజాపోరాటాల్లో పాల్గొన్నారన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజలను మరిచి పాలన సాగిస్తున్నారని హేమంతరావు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.
మాటలు తప్ప ఆచరణ శూన్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు దారి చూపిన స్వామిగౌడ్ బాటలో పయనించాలన్నారు. హైదరాబాద్‌లో పుట్టిన స్వామి గౌడ్ నేరడ చేరుకుని కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ గ్రామంలో పాఠశాల నిర్మాణం, బంచరాయి భూముల పంపిణీ తదితర కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈప్రాంత ప్రజల హృదిలో నిలిచిపోయారన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు దూసరి శ్రీరాములు, పావులూరి మల్లి కార్జున్, పగిళ్లపల్లి ఏసు, దూసరి నేతాజీ, దూసరి గోపాలరావు, ప్రభా కర్, వెంకన్న, ఆది, రవి పాల్గొన్నారు.