దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నాయకులు వి.చంద్రా రెడ్డి మాట్లాడుతూ… ఒకే రోజు కోటి మొక్కలు నాటే మహత్తరమైన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని విస్తరించేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని హరిత తెలంగాణ’గా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి , వి.హనుమంత్ రెడ్డి (బొల్లారం మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు), మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి , కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , అధికారులు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి , నర్సింహా , రాజు , సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.