మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు,అధికారులతో కలిసి ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతిష్ఠాత్మక పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ‘ఇందిరమ్మ కమిటీ’లను నియమించనుందని తెలిపారు. గృహనిర్మాణ పథకం కింద, ప్లాట్లు కలిగి ఉన్న అర్హులైన పేద లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేయబడుతుందని, అదే విధంగా భూమి లేని పేదలకు ఇళ్ల స్థలం మరియు రూ. 5 లక్షల సహాయం మంజూరు చేయబడుతుందని తెలిపారు.
ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కమిటీల నియామకానికి వారంతంలోపు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కమిటీలకు మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయా డివిజన్ కార్పొరేటర్ చైర్మన్‌గా,వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారని,ఈ రెండు కమిటీల్లో స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారని,ఈ ముగ్గురిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమించాలని సూచించారు.ఈ కమిటీ ఇందిరమ్మ ఇళ్ళ లబ్దీదారులని ఎంపిక చేస్తుందని,ఎవరైనా అనర్హులు ఎంపికై బిల్లులు తీసుకుంటే వారిపై ఫిర్యాదు చేసి,నిధులు రాబట్టే అధికారం వీరికి ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,వెంకటరామయ్య,శ్రీరాములు,రవికిరణ్,గాజుల సుజాత,బాలాజీ నాయక్,ఎం.సుజాత,కో ఆప్షన్ సభ్యురాలు వాణీ స్టీఫెన్ పాల్, ఎస్ ఈ సత్యనారాయణ,మేనేజర్ పవన్ కుమార్,ఇతర ముఖ్య అధికారులు,తదితరులు పాల్గొన్నారు.