SAKSHITHA NEWS

వాటర్ వర్క్స్, జి. హెచ్.ఎం.సి శాఖాలపై ప్రజావాణి లో కార్పొరేటర్ ఫిర్యాదులు.

మల్కాజిగిరి

వాటర్ వర్క్స్ సైనిక్ పురి  డివిజన్ లో జరిగిన ప్రజా వాణి, మల్కాజిగిరి జి. హెచ్. ఎం. సి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మల్కాజిగిరి డివిజన్ బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ లో శాంక్షన్ చేయబడిన పైప్ లైన్ పనులను చాలా నెమ్మదిగా  చేస్తున్నారని, మోరి మాన్ హోల్ ల పక్కన సిల్ట్ తీయడం లేదని, రోడ్ల పైన లీకేజీ లను రిపేర్ చెయ్యట్లేదని, వాటర్ ప్రెషర్ సమస్యలు అలాగే ఉన్నాయాని, కమర్షియల్ బిల్లుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు.వెంటనే సమస్యలను పరిష్కరించాలని జనరల్ మేనేజర్ సునీల్ ను కోరారు.

అదేవిధంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో ప్రభుత్వ భూములను కాపాడాలని అందుకు మల్కాజిగిరి సర్కిల్ లోని అన్ని ప్రభుత్వ భూములను జియో టాగ్ చెయ్యాలని, కాలనీ ల లేఔట్లు ప్రజలకు ఉచితంగా అందు బాటు లోకి తీసుకు రావాలని డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈ.ఈ లక్ష్మణ్, మంజుల, లౌక్య, దయానంద్, మల్లికార్జున్,వాటర్ వర్క్స్ అధికారులు నవీన్, ఆశ్రీత, హరీష్, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS