124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్డుపై నిలిచిన వరద నీరుని జిఎచ్ఎంసి సిబ్బందితో తొలగించడం జరిగింది. అలాగే భారీ వృక్షం ఒకటి నాలాలో కొట్టుకువచ్చి రాఘవేంద్ర నగర్ కాలనీలోని వంతెన వద్ద అడ్డుపడిందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ వెంటనే జిఎచ్ఎంసీ సిబ్బందితో అక్కడకు వెళ్లి చెట్టును తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, వాసుదేవరావు, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం… ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట…
128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా
SAKSHITHA NEWS 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా కమిటీ వారు నిర్వహిస్తున్న హజరత్ జిందాషా మాదర్ రహమతుల్లా ఆలే ఉర్సు ఉత్సవాలలో భాగంగా, గాంధీనగర్లో మొహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ముబారక్…