124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని యాభై లక్షల రూపాయల నిధులతో రాజీవ్ గాంధీ నగర్ లోని నిర్మాణ దశలో ఉన్న మరియు మొగులమ్మ కాలనీలో నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్డును మంచిగా క్యూరింగ్ చేయాలని అన్నారు. అల్విన్ కాలనీ డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పెండింగ్ వర్క్స్ లేకుండా పనులన్నీ పూర్తి చేసి డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలియచేసారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, యాదగిరి, ఇంతియాజ్, శశి, వెంకటేష్, మహేష్, రమేష్, శేఖర్, కృష్ణ, బాలరాజు, పద్మయ్య, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.