సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
*సాక్షిత : *124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయానగర్ కాలనీలోని కమాన్ టి జంక్షన్ వద్ద పదహారు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విష్ణు, రాజ్యలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…