124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ లో సీసీ రోడ్ల కొరకు గతంలో యాభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరై, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ మరియు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా ఇనాగ్రషన్ అయిన ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ సీసీ రోడ్డును కార్పొరేటర్ పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ సీసీ రోడ్డు విషయమై కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. వారం రోజులలోపు నిర్మాణ పనులు మొదలుపెట్టి, జుంక్షన్ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు మరియు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, వెంకట్ నాయక్, యం.రాజు, యాదగిరి, పద్మయ్య, అనిమేష్, కళ్యాణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.