SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 29 at 1.40.02 PM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రిభారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గార్ల ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు డివిజన్ పరిధిలోని ధరణి నగర్, పాపమ్మ కాలనీ, చంద్రమ్మ నగర్, పంచమి కాలనీ, హనుమాన్ నగర్ కాలనీలలో జిఎచ్ఎంసి అధికారులు మరియు స్థానిక వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. కాలనీలలో కొంతమేర పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తిచేస్తామని అన్నారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది.

కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు UBD నాగరాణి, వాటర్ వక్స్ రవీందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, రాజేష్ చంద్ర, కాశినాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, రాజబాబు, గోపాల్, మహీందర్ రెడ్డి, నాగేశ్వరరావు, రాజు యాదవ్, మల్లికార్జున్, ప్రసాద్, గుప్తా, రాంచందర్, వేలు, నరేందర్, మధు, రాము, గణేషన్, అచ్చుత రావు, వీరభద్రరావు, వి.వెంకటేష్, లింగం, కిరణ్, యాదగిరి, బాలరాజు, రమేష్, సర్వేశ్వరరెడ్డి, సత్తిబాబు, మునిరాజు, నాగరాజు, ఆర్.రాజు, ఇద్దయ్య, జి.వెంకటేష్, శంషాద్, శ్రీనివాస్, యాదగిరి, బాలస్వామి, రాములుగౌడ్, మౌలానా, నరసింహులు, సతీష్, భిక్షపతి, సాయిగౌడ్, సంతోష్ బిరాదర్, కూర్మయ్య, దేవేందర్, బాబు నాయక్, ప్రకాష్, వెంకటేష్, మల్లయ్య, ఉమేష్, జనయ్య, అజ్జస్, రాజ్యలక్ష్మి, మధులత, శిరీష సత్తుర్, మంజుల, షేక్ బీబీ, స్వరూపా, రేణుక, సురేఖ, నస్రీన్, నిర్మల, వనజ, శోభారాణి, పర్వీన్, బి.లక్ష్మీ, దేవి, కృష్ణవేణి, నాగలక్ష్మి, జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS