SAKSHITHA NEWS

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ని సమత నగర్ మోర్ సూపర్ మార్కెట్ పక్కన లింక్ రోడ్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రక్కకు జరిపి రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా భాగ్య నగర్ సెక్షన్ విద్యుత్ ఏ ఈ వారి సిబ్బంది మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించి, ట్రాఫిక్ సిబ్బంది వారిని పిలిచి రోడ్ కు ఇరువైపులా నిలిపిన వాహనాలను క్లియర్ చేయించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లింక్ రోడ్లు వలన ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిందని, అలానే విద్యుత్ స్తంభాలు రోడ్డు మధ్యలో ఉన్నందువలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రోడ్డుకు ఒక వైపుకు మార్చి ప్రజలకు ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని చెప్పడం జరిగింది, అలానే మోర్ సూపర్ మార్కెట్ పక్కన లింక్ రోడ్కు ఇరువయిపుల అక్రమ పార్కింగ్ ను ట్రాఫిక్ సిబ్బంది సహకారంతో చలాన్లు వేయించి, ప్రజలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , అలానే కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏ ఈ షాబాజ్, లైన్ మెన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ లు నవీన్ కుమార్, నవీన్ రెడ్డి వారి సిబ్బంది మరియు కాలనీ వాసులు, బాలు, శివ ప్రసాద్, సుబ్బరాజు, ప్రేమ్ చంద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS