Corporator at Christmas celebrations in Bhavanipuram
సాక్షిత : క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం లో జరిగిన క్రిస్టమస్ వేడుకలలో కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్టమస్ కేక్ ను కట్ చేసి, క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు అదేవిదంగా పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ,చాలా పవిత్రమైన పండుగ అని .పండుగ ను చక్కటి వాతావరణం లో శాంతి యుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా ,సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగినది
.అదేవిదంగా క్రిస్మస్ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవడానికి చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కలిపించి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణం లో పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేశామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు . అదేవిధంగా క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రిస్టియన్లకు నూతన బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, బతుకమ్మ పర్వదినంనా బతుకమ్మ చీరలు , రంజాన్ పర్వదినంనా మైనారిటీ సోదరులకు కానుకలు ,క్రిస్టియన్ వారికీ క్రిస్టమస్ కానుకలు అందించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు
అదేవిధంగా ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవడానికి బట్టలు పంపిణి చేయడం జరిగినది అని ,ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని .క్రిస్మస్ సోదర సోదరిమనులకు కిస్టమస్ శుభకాంక్షలు తెలియచేస్తునని ,అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు సందీప్ రెడ్డి , అవినాష్ రెడ్డి, పాస్టర్ ఏలీయా క్రిస్టియన్ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.