నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు..
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు (AP Police) మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు (Telangana Police) డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకొని పరిస్థితి అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి..
ఇప్పటికే సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి దౌర్జన్యంగా విడుదల అయ్యాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 522 అడుగుల చేరువలో ఉంది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది. నిన్నటి నుంచి నీటి విడుదల కొనసాగుతోంది..