SAKSHITHA NEWS

124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ, గురు గోవింద్ సింగ్ నగర్, అనసూయమ్మ మహంకాళి నగర్ కాలనీలలో రూ. 37 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని సంబంధిత అధికారులకు సూచించారు.

మంజూరైన అభివృధి పనుల వివరాలు….

  1. దత్తత్రయ కాలనీలలో రూ.15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  2. గురు గోవింద్ సింగ్ నగర్ లో రూ.10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

3 అనసూయమ్మ మహంకాళి నగర్ కాలనీలలో రూ 12 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 10 09 at 1.10.40 PM

SAKSHITHA NEWS