కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించడానికి గాను నిధుల మంజూరి కొరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరి పత్రాలను మున్నూరు కాపు సంక్షేమ సంఘం సభ్యులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ సమగ్ర ,సంతులిత అభివృద్ధి లో భాగంగా మున్నూరు కాపు సంగం సభ్యుల విజ్ఞప్తి మేరకు హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ద్వారా మొత్తము 21,00 ,000/- ఇరవై ఒక లక్ష రూపాయల ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి 21 ,00,000/- లక్షల రూపాయలను మంజూరి చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపడం జరిగినది అని , నిధులు మంజూరు కాగానే భవనం ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, చిన్న చిన్న సమావేశాలు, సభలు,ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించేందుకు సంతోషంగా ఉందన్నారు. కాలనీ ల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .కొండాపూర్ డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే భవనం నిర్మాణానికి సహాకరించిన ప్రభుత్వ విప్ గాంధీ కి కాలనీ వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు .
ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు చైర్మన్ కొన్నవేణి రమేష్, ప్రెసిడెంట్ పొగుల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, పేరుక రమేష్, బుడుగు తిరుపతి రెడ్డి, గాజుల మహేందర్,బొల్లం సంతోష్, బత్తుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు