బిసి భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
బిసి భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ బిసి భవన్ నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 2 కోట్ల అంచనాలతో బిసి భవన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. స్లాబ్ పనులు పూర్తి కాగా, ఇటుక పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. భవన నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తి చేయుటకు రూ. 1.30 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు ఆయన అన్నారు. పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ అన్నారు. అనంతరం బిసి స్టడీ సర్కిల్ సందర్శించి, గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధం అవుతున్న ఉద్యోగార్థులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సమస్యలు ఉన్నాయా, స్టడీ మెటీరియల్ అందినదా, క్లాసులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. స్టడీ సర్కిల్ లో వీక్లి పరీక్షల నిర్వహణ చేయాలని, ఇటీవల నిర్వహించిన పరీక్షా పత్రాలను పరిశీలించారు. ఫ్యాకల్టీ పై సంతృప్తిగా ఉన్నారా, ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. లైబ్రరీ లో ఉన్న పుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బిసి సంక్షేమ అధికారి జ్యోతి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తదితరులు ఉన్నారు.