SAKSHITHA NEWS

Constitution Day was celebrated grandly

భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ దళిత మోర్చా అద్యక్షుడు శనిగరపు రవి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్,మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ రావడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ 26న.. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం గా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారతదేశం. రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ.. రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో.. దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదు. కొత్తగా ప్రారంభం:
2015 నవంబర్ 19న… కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2015 అక్టోబర్ 11న ముంబైలో.. సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ.. ఈ ప్రకటన చేశారు. 2021లో… అంబేద్కర్‌ 131వ జయంతి జరిగింది. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది వరకు నవంబర్ 26న లా డే గా జరుపుకునేవారు. నవంబర్ 26న… రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రతి సంవత్సరం ఇదే రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి,ఆకుల రాజేందర్, పట్టణ ఉపాధ్యక్షులు మోతే స్వామి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, రాకేష్ ఠాకూర్, శనిగరపు రవి, ఇల్లందుల శ్రీనివాస్, ప్రైవేట్ శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్, కనుమల్ల లక్ష్మి, మోతే సులోచన తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS