SAKSHITHA NEWS

నియోజకవర్గ అభివృద్దే ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో దాదాపు 61 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, పార్కు సుందరీకరణ, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 10వ వార్డులో 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కు సుందరీకరణ, 14వ వార్డులో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓపెన్ జిమ్ ఏర్పాటు, 15వ వార్డులో 17 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణం, 17వ వార్డులో 24 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన గావించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, తెల్ల కృష్ణవేణి వినోద్ కుమార్, డప్పు కిరణ్, లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్, పాక్స్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, డైరెక్టర్ మధు సూధన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ కె.శ్రీహరి, డిఈ నరేష్, కో-ఆప్షన్స్ సభ్యులు జంగాల వెంకటేష్, సీనియర్ నాయకులు బూర్గుబావి సత్యనారాయణ, భూ లక్ష్మణ్, మధు యాదవ్, గిరి, రఘునాథ్, సుదర్శన్, రమేష్, చింత యాదవ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS