SAKSHITHA NEWS

శ్రీకాళహస్తి కి చెందిన వేణు వయసు 26, బిందు శ్రీ వయసు 22 వీరిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు.

కానీ వేరు వేరు కులాలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు.

ఆ విధంగా వారు కలిసి ఉండటం ఇష్టం లేక కలిసి చావాలని ఉద్దేశంతో శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నీటిలో దూకడం జరిగినది.

వీటిని గమనించిన కాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కన్నయ్య మరియు వారి పోలీసు బృందంతో అక్కడికి చేరుకొని ప్రాణాంతకమైన మురుగు నీటిలో కానిస్టేబుల్ కన్నయ్య దూకి ప్రేమ జంటను ఒడ్డుకు చేర్చి కాపాడడం జరిగినది.

కానిస్టేబుల్ కన్నయ్య తో పాటు వారి పోలీస్ మిత్ర బృందం రవిచంద్ర ,గిరిబాబు ,మునీంద్ర పాల్గొనడం జరిగినది.

ప్రాణాలకు తెగించి తమ పిల్లలను కాపాడినందుకు వారి కుటుంబ సభ్యులు మరియు అక్కడి ప్రజలు కానిస్టేబుల్ ‘కన్నయ్య’కు మరియు వారి పోలీస్ బృందం కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.


SAKSHITHA NEWS